కాంగ్రెస్ తోనే పేదోడి కల సాకారం

కాంగ్రెస్ తోనే పేదోడి కల సాకారం

శాంతినగర్, వెలుగు : పేదల బతుకులు మారాలంటే కాంగ్రెస్  ప్రభుత్వం  అధికారంలోకి రావాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్  పేర్కొన్నారు. మంగళవారం రాజోలి మండలం ససనూరు గ్రామానికి చెందిన 50 మంది బీఆర్ఎస్  కార్యకర్తలు కాంగ్రెస్  పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలతో పాటు అన్నివర్గాల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశ పెడుతుందన్నారు. పచ్చర్ల కుమార్, లక్ష్మన్న, అబ్రహం, భాస్కర్, శాంతన్న, దేవరాజు, శికామణి పాల్గొన్నారు.