Pushpa2TheRule: రూలింగ్కు మరో 50 రోజులు.. పుష్ప- 2 కొత్త పోస్టర్ రిలీజ్

Pushpa2TheRule: రూలింగ్కు మరో 50 రోజులు.. పుష్ప- 2 కొత్త పోస్టర్ రిలీజ్

అల్లు వారసుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన పుష్ప సీక్వెల్ "పుష్ప 2: ది రూల్" చిత్రం ఈ ఏడాది చివరన కానున్న విషయం తెలిసిందే. 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియోటర్లలోకి రానుంది.

అందుకు మరో 50 రోజుల సమయముండగా.. ఆ గడువును తెలుపుతూ మేకర్స్ తాజాగా గురువారం (అక్టోబర్ 17న) కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పుష్ప రాజ్ ఓ మాదిరిగా కుర్చీలో కూర్చొని.. తనదైన శైలిలో కాలుమీద కాలు వేసుకుని ఇంటెన్స్గా కనిపిస్తున్నాడు.

"ప్రేక్షకుల నిరీక్షణ తగ్గుతుంది. పుష్ప రాజ్ మరియు అతని బ్లాక్ బస్టర్ పాలనను చూడటానికి ఇంకా 50 రోజుల సమయం ఉంది.. పుష్ప 2: ది రూల్ తో ఇండియాన్ సినిమాకి కొత్త యుగం మొదలవుతోంది. 6 డిసెంబర్ 2024న థియేటర్లను రూల్ చేయబోతుంది" అంటూ మేకర్స్ తెలిపారు. ప్ర‌స్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు ముగించుకునే దశలో ఉంది. దాంతో దేశవ్యాప్తంగా వరుస ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతోంది చిత్ర బృందం.

ఇటీవలే.." పుష్ప2 కథకు మరిన్ని హంగులు జోడించి డైరెక్టర్ సుకుమార్‌ తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు, తాను ఫస్టాఫ్‌ చూశానని, అదిరిపోయిందని.. ప్రతి సీన్ ఇంటర్వెల్‌లా ఉంటుందంటూ ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే విడుదలైన ‘సూసేకి’, ‘పుష్ప పుష్పరాజ్‌’ పాటలు యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకున్నాయి.

Also Read:-డియర్ స్టూడెంట్స్ టీచర్‌ వచ్చేస్తోంది

పుష్ప పార్ట్ -1 సక్సెస్ కావడం.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంతో పార్ట్‌ 2పై అంచనాలు తారస్థాయికి చేరాయి. అందునా పార్ట్-1కు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని సుకుమార్ చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. అందువల్లే, ఈ చిత్రం రిలీజ్ కు ఆలస్యమవుతూ వస్తోంది. 

తొలుత ఈ మూవీ ఆగష్టు 15న థియోటర్లలోకి రానుందని ప్రకటించినప్పటికీ.. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తికాకపోవడంతో వాయిదా వేశారు. అప్పటినుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించిన అప్‌డేట్లను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

  • Beta
Beta feature