పొగమంచు ఎఫెక్ట్.. 200 విమానాలు ఆలస్యం

పొగమంచు ఎఫెక్ట్.. 200 విమానాలు ఆలస్యం

ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది.  చలిగాలులతో ఢిల్లీలో టెంపరేచర్ పది డిగ్రీలలోపే రికార్డు అవుతోంది. రెడ్ పోర్ట్, ఢిల్లీగేట్, అక్షర్ ధామ్, కరోల్ బాగ్ సహా పలుచోట్ల చలితీవ్రత భారీగా పెరిగింది.  వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.

 రైళ్లు ,విమానాల రాకపోకలపై పొగమంచు ఎఫెక్ట్ పడింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు ఎఫెక్ట్ తో విజబులిటీ జీరోకు పడిపోయింది. దీంతో 200 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.. ఢిల్లీలో సాధారణ ఉష్ణగ్రత  కంటే మూడు డిగ్రీలు కనిష్టంగా 7.6 డిగ్రీల సెల్సియస్‌గా  నమోదయ్యింది.  ఢిల్లీలో జనవరి 8 వరకు పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.  జనవరి 6న తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.  ప్రయాణికులు షెడ్యూల్ చూసుకుని బయల్దేరాలని సూచించింది. 

Also Read :- బిల్డింగ్ పై విమానం కూలింది.. ఎక్కడంటే

యూపీలోని పలుప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. ప్రఖ్యాత అయోధ్య, వారణాసీలో చలితీవ్రత పెరిగింది. చలిలోనే అయోధ్యలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. కోల్డ్ ఎఫెక్ట్ ఉన్నా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అటు అయోధ్య పరిసరాలను భారీగా పొగమంచు కప్పేసింది. టెంపరేచర్లు పదిలోపే నమాదు అవుతుండటంతో...స్థానికులు చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు. 

హర్యానాలోని పలుప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. మార్నింగ్ ఎనిమిది దాటినా...సరైన వెలుతురులేక పోవటంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎయిర్ పొల్యూషన్, పొగమంచుతో చండీఘర్ లో జనం ఇళ్ల నుంచి బయటకు రావటంలేదు. చలి వణికిస్తుండటంతో...స్థానికులు మాప్లర్లు, జాకేట్లు ధరించి నిత్యవసర వస్తువుల కోసం ఇళ్లనుంచి బయటకు వస్తున్నారు.