ఆదివారం(అక్టోబర్ 27) 50 విమానాలకు బాంబు బెదిరింపులు

ఆదివారం(అక్టోబర్ 27) 50 విమానాలకు బాంబు బెదిరింపులు

దేశంలో విమానయాన సంస్థలను బాంబు బెదిరింపు సందేశాలు బెంబేలెత్తిస్తున్నాయి. గత పదిహేను రోజులుగా ఇదే తంతు. ప్రయాణికులతో బయలుదేరిన ఫలానా విమానానంలో బాంబు పెట్టానని సందేశం పంపడం.. తీరా తనిఖీ చేస్తే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడం.. ఇదే జరుగుతోంది. 

ఆదివారం(అక్టోబర్ 27) ఒక్కరోజే 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మొత్తం మీద గడిచిన 14 రోజుల్లో 350 విమానాలకు ఈ తరహా బెదిరింపులు రావడం గమనార్హం. బెదిరింపులు బూటకమని తేలాక ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నా.. ఈ సందేశాలు విమానయాన సంస్థలను, ఎయిర్ పోర్టు సిబ్బందిని, ప్రయాణికులను, పోలీసులను అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. వస్తున్న బెదిరింపుల్లో చాలా వరకు సోషల్ మీడియా ద్వారానే వస్తున్నాయి.

బెంగళూరు- అయోధ్య ఆకాశ ఎయిర్​లైన్స్‌ 

బాంబు బెదిరింపు కాల్స్​ నేపథ్యంలో 173 మంది ప్రయాణికులతో బయలుదేరిన బెంగళూరు to అయోధ్య ఆకాశ ఎయిర్​లైన్స్‌ను​ అత్యవసరంగా అయోధ్యలో ల్యాండ్ చేశారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఘటనలు ప్రతి 15 నిమిషాలకు ఒకటి వెలుగు చూస్తున్నాయి. ఆదివారం ఇండిగోకు చెందిన 18 విమానాలకు, విస్తారాకు చెందిన 17 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు తెలిసిన విమానయాన వర్గాలు తెలిపాయి.

Also Read :- కేటీఆర్ బామ్మర్దే కొకైన్ ఇచ్చిండు

విమానాల్లో ప్రయాణించకుండా నిషేధధం

బూటకపు బాంబు బెదిరింపులకు పాల్పడే నిందితులను విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆదివారం (అక్టోబర్ 27) తెలిపారు. ఈ నకిలీ బెదిరింపులను నివారించడానికి అంతర్జాతీయ ఏజెన్సీలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌లు,ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి మద్దతు తీసుకోవడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం రెండు పౌర విమానయాన చట్టాలను సవరించే యోచన చేస్తున్నట్లు చెప్పారు.