
హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. జిల్లాలోని అనంతసాగర్ ఎస్ఆర్ కాలేజీ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. శనివారం ( ఏప్రిల్ 19 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్ నుండి హనుమకొండ వెళ్తున్న బస్సు అనంతసాగర్ ఎస్ఆర్ కాలేజీ దగ్గరకు రాగానే చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 50 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పలువురికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఆర్టీసీ అధికారులు.