జ్యోతినగర్, వెలుగు: రామగుండం నియోజకవర్గంలోని గోలివాడ, గోదావరిఖని(జనగాం)లో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర కోసం రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ నుంచి నిధులు మంజూరు చేశారు. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) కేదార్ రంజన్ పాండు గురువారం ప్రాజెక్ట్ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.50 లక్షలను పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కు అందజేశారు.
ప్రాంత అభివృద్ధి, జాతరలో పరిశుభ్రత, లైటింగ్ వంటి ఏర్పాట్ల కోసం గోలివాడకు రూ.30 లక్షలు, జనగామకు రూ.20 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహసీల్దార్లు పాల్గొన్నారు.