వారికి కూడా 50 లక్షల కరోనా ఇన్సూరెన్స్

వారికి కూడా 50 లక్షల కరోనా ఇన్సూరెన్స్

ప్రకటించిన సెంట్రల్​ హెల్త్​ మినిస్ట్రీ

న్యూఢిల్లీ: కరోనాపై పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మెడికల్​ వర్కర్లకు  కేంద్రం  రూ. 50 లక్షల ఇన్సూరెన్స్​ను ప్రకటించింది.  ప్రధాన్​ మంత్రి గరీబ్​ కల్యాణ్​ ప్యాకేజీ ఇన్సూరెన్స్​ స్కీమ్​కింద వీళ్లకు బీమా కల్పిస్తున్నట్టు సెంట్రల్​ హెల్త్​ మినిస్ట్రీ మంగళవారం ప్రకటించింది. “ప్రైవేట్​ హాస్పిటల్​ స్టాఫ్​, రిటైర్డ్​ స్టాఫ్​, వాలంటీర్లు, కాంట్రాక్ట్​వర్కర్లు, డెయిలీ వేజ్​ కింద పనిచేసినవారు,  కేంద్రం, రాష్ట్రం, అటానమస్​ హెల్త్​కేర్​ సంస్థల్లో పనిచేసే ఔట్​సోర్సింగ్​ స్టాఫ్​ కూడా ఇన్సూరెన్స్ కు అర్హులు” అని మినిస్ట్రీ పేర్కొంది. వ్యక్తిగతంగా  ఎవరూ ఈ స్కీమ్​ కింద ఎన్రోల్​ చేసుకోవాల్సిన అవసరంలేదంది. ఇన్సూరెన్స్​ ప్రీమియమ్ ను హెల్త్​ మినిస్ట్రీనే  చెల్లించనుంది.

For More News..

లాక్‌డౌన్ కంటిన్యూ?

పేషెంట్లు మామూలు ట్రీట్‌మెంట్‌తోనే మంచిగైతున్నరు