నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF) లో 50 మంది సిబ్బంది కరోనా వైరస్ బారినపడ్డారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్టాల్రలో ఎంఫాన్ తుఫాను తర్వాత సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న NDRF సిబ్బందిలో 50 మంది కరోనా బారినపడినట్టు అధికారులు తెలిపారు. కటక్, భువనేశ్వర్ ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిలో 170 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో చికిత్స కోసం వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని కటక్ సమీపంలోని ముందాలీ NDRF క్యాంపస్ భవనంలో క్వారంటైన్ చేశారు. దేశంలో మరో 24 ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా కరోనా బారినపడినట్టు అధికారులు తెలిపారు. NDRF లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మొత్తం సిబ్బంది అందరికీ పరీక్షలు నిర్వహించాలని NDRF ఉన్నతాధికారులు నిర్ణయించారు.