వచ్చే రెండేళ్లలో 50 ఫార్మా, మెడికల్ డివైజ్‌‌‌‌ ప్లాంట్లు : అరుణిష్‌‌‌‌ చావ్లా

వచ్చే రెండేళ్లలో 50 ఫార్మా, మెడికల్ డివైజ్‌‌‌‌ ప్లాంట్లు : అరుణిష్‌‌‌‌ చావ్లా

న్యూఢిల్లీ : ఫార్మా , మెడికల్ డివైజ్‌‌‌‌ సెక్టార్లలో అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌‌‌‌ఐ) స్కీమ్ వలన సుమారు 50 గ్రీన్‌‌‌‌ఫీల్డ్ ప్లాంట్లు వచ్చే రెండేళ్లలో ఏర్పాటు కానున్నాయని ఫార్మాస్యూటికల్స్ సెక్రెటరీ  అరుణిష్‌‌‌‌ చావ్లా అన్నారు. ‘మేకిన్ ఇండియా’ ఇనీషియేటివ్ తీసుకొచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా  అసోచామ్ నిర్వహించిన ఫార్మా  సమ్మిట్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. 

గత రెండేళ్లలోనే పీఎల్‌‌‌‌ఐ కింద ఏర్పాటైన ప్లాంట్లు ఇండియా నుంచి 10 బిలియన్ డాలర్ల  ఎగుమతులు జరిపాయని అన్నారు. రీసెర్చ్ లింక్డ్  ఇన్సెంటివ్ స్కీమ్‌‌‌‌ను ప్రభుత్వం తీసుకురానుందని అన్నారు. బిజినెస్‌ కోసం వాడుకోవడానికి  వీలుండే ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్‌‌‌‌లను  ప్రభుత్వం సపోర్ట్‌‌‌‌ చేస్తుందని పేర్కొన్నారు.