నారాయణఖేడ్‌లో కలుషిత నీరు తాగి 50 మందికి అస్వస్థత

నారాయణఖేడ్‌లో కలుషిత నీరు తాగి 50 మందికి అస్వస్థత

పండగ పూట నారాయణఖేడ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నారాయణఖేడ్‌ మండలంలోని సంజీవరావుపేట్‌ లో కలుషిత బావి నీళ్లు తాగి  50 మంది అస్వస్థతకు గురయ్యారు. నీళ్లు తాగిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. గ్రామస్థులు, కుటుంబీకులు వారిని హుటాహుటీన నారాయణఖేడ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.

ALSO READ : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలకు అస్వస్థత.. పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..