బోధన్​లోని చెక్కిక్యాంప్​కు చెందిన 50 మంది బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు

బోధన్​,వెలుగు: బోధన్​లోని చెక్కిక్యాంప్​కు చెందిన 50 మంది బీఆర్ఎస్​ లీడర్లు, కార్యకర్తలు మూకుమ్మడిగా బీఆర్ఎస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు మేడపాటి ప్రకాశ్​రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు.

పార్టీలో చేరిన వారిలో బాలనర్సయ్య, మల్లంస్వామి, మెట్టు శేఖర్,​ పిట్ల రవి, బాలరాజు, భానుచందర్, సురేశ్​రవి, నర్సింలు, మధు, రమేశ్,​​ శివశంకర్, శివలింగం, ఈశ్వర్ ఉన్నారు. కార్యక్రమంలో బోధన్​నియోజకవర్గ ప్రభారి రాంచరణ్​ యాదవ్, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, బోధన్​ పట్టణాధ్యక్షుడు బాలరాజు,  ప్రధాన కార్యదర్శులు వాసు, సందీప్, శివరాజ్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కృష్ణ తదితరులు ఉన్నారు.