యాదాద్రి, వెలుగు: ‘పిల్లలను పొగిడితే చెడిపోతారనడం తప్పు. పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఆ సంతోషమే వారిని ముందుకు తీసుకెళ్తుంది. తల్లితండ్రులు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. తమ ఇంటికి పిల్లలే హీరోలు’ అని టీచ్ఫర్చేంజ్చైర్మన్, సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. యాదాద్రి జిల్లాలోని 50 ప్రైమరీ స్కూల్స్‌ను టీచ్ఫర్ చేంజ్సంస్థ దత్తత తీసుకుంది. దత్తత తీసుకున్న స్కూల్స్స్టూడెంట్స్నైపుణ్యాన్ని స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల ద్వారా మూడేండ్ల వ్యవధిలో పెంపొందించాల్సి ఉంటుంది. ఈ మేరకు యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి, మంచు లక్ష్మి ఎంవోయూపై సంతకాలు చేశారు. అనంతరం ఆలేరు మండలం పటేల్గూడెంలోని ప్రైమరీ స్కూల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్స్‌లోని పిల్లలకు నైపుణ్యంతో కూడిన చదువు చెప్పిండానికే దత్తత తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకూ 450 స్కూల్స్‌ను తాము దత్తత తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, డీఈవో నారాయణరెడ్డి, కో ఆర్డినేటర్ అండాలు ఉన్నారు. అంతకుముందు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మంచులక్ష్మి దర్శించుకున్నారు.