50 చైల్డ్ కేర్ సంస్థల లైసెన్సుల రెన్యువల్

50 చైల్డ్ కేర్ సంస్థల లైసెన్సుల రెన్యువల్

హైదరాబాద్ సిటీ, వెలుగు : తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ పిల్లలకు చైల్డ్ కేర్ సంస్థలు తల్లిదండ్రులుగా మారి బాగోగులు చూడడం అభినందనీయమని కలెక్టర్​అనుదీప్​అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్​హాల్​లో ఐసీసీఎస్, చైల్డ్ కేర్ సంస్థలకు లైసెన్స్ రెన్యువల్ జారీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలోని 50 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లకు లైసెన్సులు రెన్యువల్​చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం పిల్లలకు దత్తతకు వెళ్తే ఎలా ఉంటుందో అవగాహన కల్పించాలన్నారు. డిస్ట్రిక్ట్​ వెల్ఫేర్ ఆఫీసర్ అక్కేశ్వరరావు, డీసీపీఓలు, చైల్డ్ కేర్ ఇన్​స్టిట్యూట్ల​ ప్రతినిధులు పాల్గొన్నారు.