
వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో దారుణం జరిగింది. కుక్కల దాడిలో 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మల్లేశం అనే కాపరికి చెందిన 70 గొర్రలపై నిన్న(ఫిబ్రవరి 12) రాత్రి పూట గుంపులుగా వచ్చిన కుక్కలు విచక్షణా రహితంగా దాడి చేశాయి. కుక్కల దాడిలో 50 గొర్రెలు మృతి చెందాయి... మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. కుక్కల దాడితో రైతుకు 6 లక్షల రూపాయల నష్టం జరిగి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.
ALSO READ :- తొలిప్రేమ స్టైల్లో వరుణ్ లవ్ ప్రపోజల్.. భర్తపై లావణ్య క్యూట్ కామెంట్స్
రోజూలాగే గొర్రెలను మేపి తన పొలం వద్ద ఉన్న షెడ్ లో గొర్రలను ఉంచాడు. ఆ తర్వాత భోజనానికి ఇంటికి వచ్చానని... తిరిగి వెళ్ళి చూసేసరికి గొర్రెలు చనిపోయాయని రైతు మల్లేశం ఆవేదన వ్యక్తం చేశాడు. కుక్కుల దాడితో తమ జీవనోపాధి కోల్పోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నాడు.