557 రోజుల్లో 50 వేల సెల్‌‌ఫోన్లు రికవరీ

 557 రోజుల్లో 50 వేల సెల్‌‌ఫోన్లు రికవరీ
  • సీఈఐఆర్​తో రోజుకు సగటున  91 ఫోన్ల గుర్తింపు

హైదరాబాద్‌‌, వెలుగు: చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్‌‌ ఫోన్లను సీఈఐఆర్‌‌ (సెంట్రల్ ఎక్విప్‌‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌‌ను ఉపయోగించి రాష్ట్ర పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. 50 వేలకు పైగా సెల్‌‌ఫోన్స్‌‌ను గుర్తించి మన పోలీసులు దేశంలోనే రెండో స్థానంలో నిలిచారు. గతేడాది ఏప్రిల్ 20 నుంచి ఈ నెల 3వ తేదీ వరకు మొత్తం 557 రోజుల్లో  రాష్ట్రంలో 50,788 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు.

ఈ మేరకు సీఐడీ డీజీ శిఖా గోయల్‌‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 780 పోలీస్ స్టేషన్స్‌‌లో సీఈఐఆర్‌‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం సగటున రోజుకు 91 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేస్తున్నారు. శిఖా గోయల్‌‌ సారథ్యంలోని డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ టెలీకమ్యూనికేషన్స్‌‌ సమన్వయంతో సీఐడీ సైబర్‌‌ క్రైమ్‌‌ వింగ్‌‌ సెల్‌‌ఫోన్ల రికవరీ చేస్తున్నది.