పద్మారావునగర్, వెలుగు: బ్యాంక్ఉద్యోగి ఇంట్లోకి చొరబడిన దొంగలు 50 తులాల గోల్డ్, రూ.లక్ష క్యాష్ఎత్తుకెళ్లిన ఘటన గాంధీనగర్పోలీస్స్టేషన్పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ హెచ్ డీఎఫ్సీ బ్యాంకులో పనిచేస్తున్న శ్రీనివాస్కుటుంబంతో కలిసి గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న కృష్ణానగర్కాలనీలోని అపార్టుమెంట్లో ఉంటున్నాడు.
మంగళవారం ఉదయం శ్రీనివాస్ డ్యూటీకి వెళ్లగా, అతని భార్య సబిత ఎల్ బీనగర్లోని తల్లి గారింటికి వెళ్లింది. కూతురు అనుష్క ఇంటికి తాళం వేసి కాలేజీకి వెళ్లింది. సాయంత్రం అనుష్క ఇంటికి వచ్చేసరికి మెయిన్డోర్పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా, బీరువాలోని 50 తులాల గోల్డ్బిస్కెట్లు, నగలు, రూ.లక్ష నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.