IND vs BAN: బంగ్లా ఆల్‌రౌండర్ సరికొత్త చరిత్ర.. మునుపెన్నడూ చూడని రికార్డు

IND vs BAN: బంగ్లా ఆల్‌రౌండర్ సరికొత్త చరిత్ర.. మునుపెన్నడూ చూడని రికార్డు

ఆంటిగ్వా వేదికగా భారత్ తో జరుగుతున్న సూపర్ -8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌‌ స్టార్ ఆల్‌రౌండర్ టీ20 ప్రపంచకప్‌లలో మునుపెన్నడూ చూడని రికార్డు సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో 50 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా షకీబ్ చరిత్ర సృష్టించాడు. భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ పడగొట్టిన తర్వాత షకీబ్ ఈ ఘనత సాధించాడు.

టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక వికెట్లు

  • 1. షకీబ్ అల్ హసన్: 42 మ్యాచ్‌ల్లో 50 వికెట్లు* 
  • 2. షాహిద్ అఫ్రిది: 34 మ్యాచ్‌ల్లో 39 వికెట్లు
  • 3. లసిత్ మలింగ : 31 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు
  • 4. వనిందు హసరంగా: 19 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు
  • 5. సయీద్ అజ్మల్: 23 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు

కాగా, 2007 నుండి టీ20 ప్రపంచకప్‌ల యొక్క అన్ని ఎడిషన్లలో ఆడిన ఇద్దరు ఆటగాళ్లలో షకీబ్ అల్ హసన్ ఒకరు. మరొకరు భారత జట్టు రోహిత్ శర్మ.