అమెరికాలో వెతికి మరీ 500 మంది అరెస్ట్: ఆపరేషన్ ట్రంప్ మొదలైపోయింది..!

అమెరికాలో వెతికి మరీ 500 మంది అరెస్ట్: ఆపరేషన్ ట్రంప్ మొదలైపోయింది..!

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మూడు రోజుల్లోనే ట్రంప్ దూకుడు పెంచారు. వచ్చి రాగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేసిన ట్రంప్.. తాజాగా ఎన్నికలకు ముందు మాటిచ్చినట్లుగా అమెరికాలో ఉంటోన్న అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టారు. అమెరికాలో ఏ మూలన దాక్కున్న అక్రమ  వలసదారులను ఉపేక్షించొద్దని తన విధానాన్ని స్పష్టంగా అధికారులకు చెప్పారు ట్రంప్. అధ్యక్షుడి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు.. సరిహద్దు దేశం మెక్సికోతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో నివస్తోన్న అక్రమదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. 

ఈ క్రమంలోనే ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజుల్లోనే 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు. దీంతో పాటుగా అమెరికాలో ఉంటున్న వందలాది మంది అక్రమ వలసదారులను బహిష్కరించారు. అక్రమదారులపై అరెస్టులపై  వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 538 అక్రమ వలస నేరస్థులను అరెస్టు చేసింది. వీరిలో అనుమానిత ఉగ్రవాది ట్రెన్ డి అరగువా ముఠాలోని నలుగురు సభ్యులు ఉన్నారు. వీరితో పాటు మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడిన అనేక మంది నేరస్తులు ఉన్నారు’’ అని కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. 

ALSO READ | అమెరికా తెలుగు స్టూడెంట్స్ లో ట్రంప్ భయం : పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై

ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ అని.. ప్రస్తుతం ఈ ఆపరేషన్ వేగంగా జరుతోందని తెలిపారు. ఈ ఆపరేషన్ ద్వారా ట్రంప్ చేసిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటున్నారని అన్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రద్దు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ముఖ్యమైనది జన్మతః పౌరసత్వం యాక్ట్. ఈ చట్టం ప్రకారం.. యూఎస్ వలస వెళ్లిన విదేశీయులు అమెరికాలో పిల్లలకు జన్మనిస్తే.. ఆ పిల్లలకు ఆటోమెటిక్‎గా అమెరికన్ సిటిజన్ షిప్ వస్తోంది.

ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన జన్మతః పౌరసత్వం విధానాన్ని రద్దు చేశారు. ఇకపై విదేశీయులు అమెరికాలో పిల్లలకు జన్మనిచ్చిన వారికి అమెరికన్ సిటిజన్ షిప్ వర్తించదు. ఇకపై అమెరికా పౌరులు లేదా గ్రీన్ హోల్డర్స్ పిల్లలకు మాత్రమే అమెరికా సిటిజన్ షిప్ లభిస్తోంది.  జన్మతః పౌరసత్వం యాక్ట్ రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేసిన రెండు రోజుల్లోనే అమెరికాలో విదేశీయుల బహిష్కరణ, అరెస్టులు జరగడంతో అగ్రరాజ్యంలోని వలసదారులు ఆందోళనకు గురి అవుతున్నారు.