బైంసాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. 500 మంది రాజీనామా

నిర్మల్ జిల్లా బైంసాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది.  భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు పలువురు జెడ్పీటీసీ ,ఎంపీపీలు, సర్పంచులు ఆ పార్టీకి  మూకుమ్మడిగా రాజీనామా చేశారు.  పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న ఉద్యమ నాయకులను కాదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తనకు అనుకూలమైన  వ్యక్తులకే ఇప్పటి వరకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. 

దీంతో బీఆర్ఎస్ నాయరకులతో పాటుగా 500 మంది కార్యకర్తలు రాజీనామా చేశారు.  ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు.  ఎమ్మెల్యే తీరుపై పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాద చేసిన ఎలాంటి నిర్ణయం లేదన్నారు.  త్వరలో తమ భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.

ALSO READ : బీజేపీకి అవకాశం ఇవ్వండి.. బంగారు తెలంగాణ చేసి చూపిస్తం : రాజాసింగ్