రూ.5 వేల ఫైన్‌తో 31 లోపు ఐటీఆర్ ఫైలింగ్​

రూ.5 వేల ఫైన్‌తో 31 లోపు ఐటీఆర్ ఫైలింగ్​

న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్‌‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌‌లను ఫైల్ చేయనివారు తక్కువ  ఫైన్‌‌ చెల్లించి ఈ నెల 31 లోపు  రిటర్న్‌‌లను ఫైల్‌‌ చేయొచ్చు. రూ.5 వేలు లేట్ ఫీజు కట్టి ఐటీఆర్‌‌‌‌లను ఫైల్ చేయొచ్చు. డిసెంబర్‌‌‌‌  31– వచ్చే ఏడాది మార్చి 31 (అసెస్‌‌మెంట్ ఇయర్‌‌‌‌ 2024–25)  మధ్య ఐటీఆర్ ఫైల్ చేయాలనుకునేవారు రూ.10 వేల ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

రూ.5 లక్షల లోపు ఆదాయం పొందేవారు ఫైన్ కింద రూ.1,000 కడితే సరిపోతుంది.  ‘ఐటీఆర్‌‌‌‌ను ఈ ఏడాది జులై లోపు ఫైల్ చేయలేకపోయిన వారు సెక్షన్ 1 39 (1) లేదా సెక్షన్‌‌ 142(1) కింద ఇష్యూ అయిన నోటిస్ ప్రకారం ముందు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్‌‌‌‌ను ఫైల్ చేయొచ్చు. కానీ, సెక్షన్ 234 ఎఫ్‌‌ కింద లేట్‌‌ ఫీజు ఉంటుంది’ అని  ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్ పేర్కొంది.