
- ఇంజినీరింగ్ విభాగానికి 3,116, ఫార్మసీకి 1,891
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎప్ సెట్ అప్లికేషన్ల ప్రక్రియ శనివారం మొదలైంది.
తొలిరోజే శనివారం సాయంత్రం వరకు 5,010 అప్లికేషన్లు వచ్చినట్టు ఎప్ సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కో కన్వీనర్ విజయకుమార్ తెలిపారు. దీంట్లో ఇంజినీరింగ్ విభాగానికి 3,116 దరఖాస్తులు, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 1,891 దరఖాస్తులు రాగా.. రెండింటికీ కలిపి 3 అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు.