పంజాగుట్ట,వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావ్‌ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 502 అర్జీలు వచ్చాయి. ఇందులో రెవెన్యూ 112, మైనారిటీ వెల్ఫేర్71, సివిల్సప్లై 69, పంచాయితీ రాజ్42, మున్సిపల్,అర్బన్35, ఇతర శాఖలకు చెందిన మరో 173 ఉన్నాయి. అదేవిధంగా 19.70 ఎకరాల ఆస్తిని పంచాలంటూ తన 5 గురు కొడుకులు చంపాలని చూస్తున్నారని తనకు రక్షణ కల్పించాలని యాదాద్రి జిల్లా నెమరగోములకు చెందిన సంకూరి యాదగిరి(75) ఫిర్యాదు చేశాడు.
అంతే కాకుండా రాళ్లతో కొట్టి నాఎడమ కాలు విరగొట్టారని అతడు మొరపెట్టుకోగాప్రజావాణి నోడల్ సంబంధిత ఆర్డీవోకు ఆదేశాలు జారీచేశారు. డబుల్ ఇండ్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని కోరుతూ ఓల్డ్ సిటీకి చెందిన పలువురు మహిళలు వచ్చి బారులు తీరారు. మూసీ నుంచి మెయిన్డ్రైనేజీ ట్రంకు లైన్నిర్మించాలని సిటీ శివారు తట్టి అన్నారం ప్రాంతానికి చెందిన అనుబంధ12 కాలనీల సెంట్రల్అసోసియేషన్ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. సమస్యను విన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అట్టి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.