మేడారంలో సుడిగాలి బీభత్సం... 50వేలకు పైగా చెట్లు నేలమట్టం

మేడారంలో సుడిగాలి బీభత్సం... 50వేలకు పైగా చెట్లు నేలమట్టం

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. చాలా చోట్ల వాగులు ఉప్పొంగి రోడ్లన్నీ జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో వరదలు కాలనీలు ముంచెత్తుతున్న క్రమంలో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా.. భారీ వర్షాలకు అడవులు కూడా దెబ్బతింటున్నాయి. ములుగు జిల్లాలోని తాడ్వాయి ఫారెస్ట్ భారీవర్షాలకు తీవ్రంగా దెబ్బతింది.

Also Read:-ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు తాడ్వాయి ఫారెస్ట్ పై తీవ్ర ప్రభావం చూపాయి. అడవిలో 200 హెక్టార్లలో 50 వేలకు పైగా చెట్లు కూలిపోయాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఒక్క గాలివానకే ఇంత పెద్ద నష్టం జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఈ రేంజ్ లో నష్టం వాటిల్లటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు అధికారులు.