- ప్రకటించిన సీఎం నవీన్ పట్నాయక్
భువనేశ్వర్: కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న హెల్త్ వర్కర్లు, సపోర్ట్ సర్వీస్ స్టాఫ్ చనిపోతే వారి కుటుంబాలకు రూ.50లక్షల పరిహారం అందిస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మంగళవారం ప్రకటించారు. వారికి అమరవీరుల హోదా కల్పిస్తూ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. డాక్టర్లు చేసిన త్యాగాలకు గాను వారికి అవార్డులు అందజేస్తామని చెప్పారు. హెల్త్ సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. “ డాక్టర్లపై దాడి చేస్తే రాష్ట్రంపై దాడి చేసినట్లు. డాక్టర్లు, హెల్త్ వర్కర్లు చేస్తున్న నిస్వార్థమైన సేవకు మనం థ్యాంక్స్ చెప్పాలి” అని నవీన్ పట్నాయక్ అన్నారు.