
మంచిర్యాల, వెలుగు: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 51మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్లు పొందారు. సీపీ ఆఫీస్లో కమిషనర్ అంబర్ కిశోర్ ఝా వారికి ప్రమోషన్ ర్యాంక్ చిహ్నాన్ని అందించి విషెస్ తెలిపారు. ప్రమోషన్లతో పోలీసులకు గుర్తింపు లభిస్తుందన్నారు. ఎలాంటి రిమార్క్ లేకుండా పనిచేస్తూ మరిన్ని ప్రమోషన్లు పొందాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏవో శ్రీనివాస్, ఆర్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే శిక్ష తప్పదు
చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసినా ఉపేక్షించేది లేదని, అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారిని జైలుకు పంపిస్తామని సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. మంగళవారం రాత్రి మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్ నగర్లో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్ర మంలో సీపీ పాల్గొన్నారు. ప్రజలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉండే 100 కు డయల్ చేయాలని సూచించారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.