ఖమ్మం జిల్లాలో 51 అడుగుల బతుకమ్మ

ఖమ్మం జిల్లాలో 51 అడుగుల బతుకమ్మ
  • పెరికసింగారంలో సద్దుల సంబురం
  • చీఫ్  గెస్ట్​గా హాజరైన మంత్రి పొంగులేటి 

కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికసింగారం గ్రామంలో 62 ఏండ్ల నుంచి సద్దుల బతుకమ్మను వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్​రావు, ఆయన సతీమణి ఆధ్వర్యంలో 2003 నుంచి భారీ బతుకమ్మలను ఏర్పాటు చేస్తున్నారు. గురువారం 51 అడుగుల భారీ బతుకమ్మను తీరొక్క పూలతో అలంకరించారు. 

ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి హాజరై మహిళలతో కలిసి కోలాటం ఆడారు. మహిళలు, యువతులు బతుకమ్మ ఆడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు.