హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 81.80 శాతం మంది అటెండ్ అయ్యారు. మొత్తంగా 62,983 మంది అటెండ్ కావాల్సి ఉండగా, 51,525 మంది హాజరయ్యారని మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్‌చారి తెలిపారు. వివిధ కారణాలతో 11,457 మంది అటెండ్ కాలేదని చెప్పారు.
దీంట్లో అమ్మాయిలు 27,597 మందికి 22860 మంది, అబ్బాయిలు 35,386 మందికి గానూ 28,665 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. అయితే, ఆరోతరగతిలో ప్రవేశాలకు 35,545 మందికి గానూ 29,511 మంది అటెండ్ అయ్యారని వివరించారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని, త్వరలోనే ఫలితాలు రిలీజ్ చేస్తామని వెల్లడించారు.