
గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకునే ఆసక్తి ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం దొరికింది. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్ఐఆర్‌డీపీఆర్) స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, యంగ్ ఫెలో, క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా క్లస్టర్ మోడల్ గ్రామపంచాయతీలను అభివృద్ధి చేయడంలో భాగంగా భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎన్ఐఆర్‌డీపీఆర్ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్
ఈ పోస్టులో ఎంపికైన వారు క్లస్టర్ మోడల్ గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా ఎంపిక చేసిన గ్రామపంచాయతీల్లో జరుగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది.
అర్హత: సోషల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ (ఎకనమిక్స్/ రూరల్ డెవలప్‌మెంట్/ రూరల్ మేనేజ్‌మెంట్/ పొలిటికల్ సైన్స్/ ఆంథ్రపాలజీ/ సోషల్‌వర్క్/ డెవలప్‌మెంట్ స్టడీస్/ హిస్టరీ) ఉత్తీర్ణతతో పాటు కనీస అకడమిక్ మెరిట్ (పదోతరగతి నుంచి పీజీ వరకు) అవసరం. పదో తరగతిలో 60 శాతం, ఇంటర్మీడియట్‌లో 50 శాతం, గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం మార్కులు ఉండాలి.
వయసు: 1 నవంబర్ 2020 నాటికి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ&ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.55 వేలు ఉంటుంది. దీంతో పాటు ఎన్ఐఆర్‌డీపీఆర్ రూల్స్ ప్రకారం ట్రావెలింగ్, ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
యంగ్ ఫెలో
క్షేత్రస్థాయిలో గ్రామపంచాయతీలకు వెళ్లి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వారికి గ్రామపంచాయతీ పనులను వివరిస్తూ, వారితో కలిసి అభివృద్ధి పనుల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
అర్హత: సోషల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా(ఎకనమిక్స్/ రూరల్ డెవలప్‌మెంట్/ రూరల్ మేనేజ్‌మెంట్/ పొలిటికల్ సైన్స్/ ఆంథ్రపాలజీ/ సోషల్‌వర్క్/ డెవలప్‌మెంట్ స్టడీస్/ హిస్టరీ) ఉత్తీర్ణతతో పాటు కనీస అకడమిక్ మెరిట్ (పదోతరగతి నుంచి పీజీ వరకు) కూడా అవసరం. పదో తరగతిలో 60 శాతం, ఇంటర్మీడియట్‌లో 50 శాతం, గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం మార్కులు ఉండాలి.
వయసు: 1 నవంబర్ 2020 నాటికి 21-–30 ఏళ్ల మధ్య ఉండాలి.ఎస్సీ & ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.35 వేలు ఉంటుంది. దీంతో పాటు ఎన్ఐఆర్‌డీపీఆర్ రూల్స్ ప్రకారం ట్రావెలింగ్, ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్
ఈ పోస్టులో ఎంపికైన వారు వార్డు స్థాయిలో ప్రజల్ని గ్రామపంచాయతీ విధుల్లో (గ్రామ సభ, వార్డ్ సభ, మహిళా సభ)పాల్గొనేలా చైతన్యవంతుల్ని చేయాలి.
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు సెల్ప్ హెల్ప్ గ్రూప్స్‌లో పని చేసిన అనుభవం/ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ లీడర్‌గా పని చేసి ఉండడం/ ఎన్ఐఆర్‌డీపీఆర్/ ఎన్ఆర్ఎల్ఎం/ ఎస్ఆర్ఎల్ఎం నుంచి సంబంధిత సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ చేసి ఉండాలి.
వయసు: 1 నవంబర్ 2020 నాటికి 25-–40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ & ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.12,500 ఉంటుంది. దీంతో పాటు ఎన్ఐఆర్‌డీపీఆర్ రూల్స్ ప్రకారం ట్రావెలింగ్, ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
రిక్రూట్మెంట్ విధానం: ఇవి పూర్తిగా కాంట్రాక్టు పోస్టులు. ఏడాది కాంట్రాక్టు ఉంటుంది. అభ్యర్థి పనితీరు నచ్చితే కాంట్రాక్టు కాలపరిమితి పొడిగించవచ్చు.
మోడల్ జీపీ క్లస్టర్స్ ప్రాజెక్ట్‌కు ఎంపికైన తెలంగాణ జిల్లాలు: ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ రూరల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్భూపాలపల్లి మొత్తం అయిదు జిల్లాలు
పోస్టుల రిజర్వేషన్లు: ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం