- 64 మందికి 200 నుంచి 500 ఎంజీల బీఏసీ నమోదు
గచ్చిబౌలి, వెలుగు : మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, జైలుకు పంపిస్తామని హెచ్చరించినా కొందరిలో ఏమాత్రం మార్పు రావట్లేదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏకంగా 513 మంది మందుబాబులు పట్టుబడ్డారు.
ఇందులో 425 మంది బైకర్లు, 24 మంది ఆటో డ్రైవర్లు, 60 మంది కారు డ్రైవర్లు, నలుగురు లారీ డ్రైవర్లు ఉన్నారు. వీరిలో 64 మందికి బ్లడ్ ఆల్కహాల్కాన్సెంట్రేషన్(బీఏసీ) 200/100 ఎంజీనుంచి 500/100 ఎంజీ వచ్చింది. వీరందరిపై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ట్రాఫిక్పోలీసులు తెలిపారు.