
- వెలుగు, వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో భారతీయ నాటక కళా సమితి ఆధ్వర్యంలో 51వ రాష్ట్రస్థాయి నాటక పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నాటిక పోటీలకు ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హాజరయ్యారు.
తొలిరోజు విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్- --హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘ స్వేచ్ఛ’, డీఎల్ కాంతారావు-- పోస్టల్ ఉద్యోగులు (తెనాలి) ‘ది లెసన్’ అనే నాటకాలు ప్రదర్శించారు. మితిమీరిన స్వేచ్ఛ- అనర్థాలకు దారి తీస్తుందనే ఇతివృత్తంతో ప్రదర్శించిన స్వేచ్ఛ అనే నాటకం ప్రజలను ఆలోచింపచేసింది. అతి గారాబం కొంపకు చేటనే అంశంతో ప్రదర్శించిన ‘ది లెసన్’ కళాభిమానులను అలరింపజేసింది.