పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక .. బరిలో 52 మంది

 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక .. బరిలో 52 మంది

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది నిలిచారు. మొత్తం 63 మంది నామినేషన్లు దాఖలుకాగా.. 11 మంది ఉపసంహరించుకున్నారు. ఈనెల 27వ తేదీన 12 జిల్లాల పరిధిలో పోలింగ్ జరగనుంది. జూన్ 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 4లక్షల 61వేల 806 మంది ఓటర్లు ఉన్నారు. 

తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ మద్దతిస్తుండగా....బీజేపీ.. ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఏనుగుల రాకేశ్ రెడ్డికి మద్దతిస్తుంది. ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉపఎన్నికపై దృష్టిపెట్టాయి. రేపు మూడు జిల్లాల ముఖ్యనేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. సిట్టింగ్ సీటును కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ వ్యూహాలు రచించనుంది.  

ఈ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు పదవీకాలం ఉంది.  అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో  ఎమ్మెల్సీ పదవికి  డిసెంబరు 9న రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఈసీ ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ చేసింది.