ఇడ్లీ కూడా ప్రశాంతంగా తిననివ్వట్లేదు.. ఇలాంటి హోటల్స్లో ఇలాంటి ఇడ్లీ తింటే క్యాన్సర్ గ్యారెంటీ..!

ఇడ్లీ కూడా ప్రశాంతంగా తిననివ్వట్లేదు.. ఇలాంటి హోటల్స్లో ఇలాంటి ఇడ్లీ తింటే క్యాన్సర్ గ్యారెంటీ..!

బెంగళూరు: దక్షిణ భారతదేశంలో ఇడ్లీకి ఉండే క్రేజే వేరు. టేస్ట్ తెలియక ఈతరం ఇడ్లీని దూరం పెడుతుంది కానీ మృదువైన ఇడ్లీని చట్నీలో నంజుకు తింటే ఆ టేస్ట్ వేరె లెవెల్. అలాంటి ఇడ్లీ తయారీలో కూడా కర్ణాటకలోని కొన్ని హోటళ్లు ప్లాస్టిక్ వాడుతున్నాయి. స్వయంగా కర్ణాటక ప్రభుత్వమే ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.

కర్ణాటకలోని హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు చేయగా.. 52 హోటల్స్లో ఇడ్లీ తయారీకి పాలిథీన్ షీట్స్ వాడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ విషయాన్ని కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూ రావు వెల్లడించారు. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోటల్స్లో ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడకంపై కర్ణాటక ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది.

రాష్ట్రవ్యాప్తంగా 251 ఇడ్లీ శాంపిల్స్ను హెల్త్ డిపార్ట్మెంట్ టెస్ట్ చేసిందని, ఈ పరీక్షల్లోనే 52 ఇడ్లీ శాంపిల్స్లో ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించారు. హోటళ్లలో ఇడ్లీని ఉడికించేందుకు ఇడ్లీ పాత్రలపై క్లీన్ కాటన్ క్లాత్ను వాడుతుంటారు. కానీ.. కర్ణాటకలోని 52 హోటల్స్లో క్లాత్ బదులు పాలిథీన్ షీట్స్ను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ తనిఖీలతో బయటపడింది. 

Also Read:-నన్నే చలానా అడుగుతావా.. ట్రాన్స్ఫర్ చేయిస్తా అంటూ..

ఇడ్లీని ఉడికించే క్లాత్తో పోల్చుకుంటే పాలిథీన్ షీట్ ఖరీదు తక్కువ. ఈ కారణంగా.. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి కాసుల కక్కుర్తితో కొన్ని హోటల్స్ ఇడ్లీలను ఇలా ఉడికించి కస్టమర్లకు సప్లై చేస్తున్నాయి. ఇలాంటి ప్లాస్టిక్ అవశేషాలు కలిసి ఉన్న ఇడ్లీలను తినడం వల్ల క్యాన్సర్ను కొని తెచ్చుకున్నట్టేనని వైద్యులు చెబుతున్నారు.


 
అసలే విపరీతమైన కాలుష్యం ఉండే రోడ్ల పక్కన దుమ్ము, ధూళి పడుతూ ఉంటే ఇడ్లీ, దోశ , జిలేబి, పానీపూరి లాంటి ఆహారాన్ని తయారుచేసి విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ పాత్రలలో తయారీ, నిల్వ, ప్లాస్టిక్​ కవర్లలో నిల్వ, అపరిశుభ్ర నీటిని వినియోగించడం, కల్తీ పిండి, కల్తీ మసాలాలు, కల్తీ నూనెలు, నిల్వ ఆహారానికి రసాయనాలు కలిపి వేడి చేసి విక్రయించి ప్రజల మరణాలకు ఆహార విక్రేతలు కారణమవుతున్నారు.

ప్రాణాలను నిలపాల్సిన ఆహారమే నేడు మన ప్రాణాన్ని తోడేస్తున్నది. కలుషితమైన, నాసిరకమైన, విషరసాయనాలు కలిసిన ఆహారం భుజించడం ద్వారా ప్రతి సంవత్సరం 60 కోట్లమంది అనారోగ్యానికి గురవుతున్నారని, ప్రతి పది మందిలో ఒకరు ఆహారం తీసుకున్న వెంటనే అనారోగ్యం పాలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు బయటపెట్టింది.