317 జీవో సవరణకు 52 వేల అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: 317 జీవోను సవరించి న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి 52,235 మంది ఉద్యోగులు, అధికారులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. వీరిలో 30 వేల మంది స్థానికత కోల్పోయిన వాళ్లే ఉన్నారు. శాఖల వారీగా వచ్చిన అప్లికేషన్ల వివరాలను జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావు శుక్రవారం ఆయా శాఖలకు పంపారు. వీటిని పరిశీలించి ఫార్మాట్ ప్రకారం రిపోర్ట్ ఇవాలని అన్ని శాఖలను ఆయన ఆదేశించారు. 

ఇప్పటికి 4 సార్లు 317పై మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్ గా మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబుతో కూడిన సబ్ కమిటీ సమావేశం అయింది. 5వ మీటింగ్ ఈ నెల 18న ఉందని అప్పటిలోగా వివరాలు అందజేయాలని అన్ని శాఖలను సెక్రటరీ ఆదేశించారు. అప్లికేషన్లలో ఎక్కువగా స్కూల్ ఎడ్యుకేషన్, హోం, పంచాయతీరాజ్, హెల్త్, రెవెన్యూ శాఖలే ఉన్నాయి.