ఇది నిజమేనా : సిగరెట్లు ఎక్కువ తాగితే.. గొంతులో వెంట్రుకలు వస్తాయా..?

సిగరెట్ కు.. జట్టుకు లింక్ ఉందా.. యుక్త వయస్సులోనే నెత్తి మీద జుట్టు రాలిపోతున్న కాలం ఇది.. అలాంటిది గొంతులో వెంట్రుకలు మొలుస్తున్నాయా.. సిగరెట్లు ఎక్కువ తాగితే.. గొంతులో వెంట్రుకలు వస్తాయా.. ఆస్ట్రియా దేశంలో ఓ వ్యక్తికి ఎదురైన అనుభవమే ఇదీ.. పూర్తి వివరాల్లోకి వెళితే...ఆస్ట్రియాకు చెందిన 52 ఏళ్ల చైన్ స్మోకర్‌..  రోజూ ఒక ప్యాకెట్ సిగరెట్ తాగేవాడు. దాదాపుగా తన జీవితంలో సుమారు మూడు దశాబ్దాలు సిగరెట్లను తాగాడు.

1990లో అతనికి 20 ఏళ్ల వయసున్నప్పుడు ధూమపానం స్టార్ట్ చేశాడు.   దీంతో అతని  గొంతులో 9 వెంట్రుకలు మొలిచాయి.  2007లో వైద్యుడి వద్దకు వెళ్లగా ఈ విషయం భయటపడింది. అయితే  వాటిని శాశ్వతంగా తొలగిస్తామని, అందుకు స్మోకింగ్ మానేయాల్సి ఉంటుందన్నారు వైద్యులు. అందుకు అతడు ఒప్పుకోలేదు. 15 ఏళ్లుగా  వాటిని తాత్కాలికంగా తీయించుకుంటూ నరకం అనుభవించాడు. 

ఇక భరించలేక ఎట్టకేలకు స్మోకింగ్ మానేసి సర్జరీ చేయించేశాడు. సర్జరీ సక్సెస్ అని, గొంతులో ఇక వెంట్రుకలు రావని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. . అయితే గొంతులో ఇలా కావడానికి కారణం ధూమపానం ఎక్కువగా కాల్చడమేనని వైద్యులు తేల్చారు. అతనికి పుట్టుకతోనే గొంతులో 2 ఇంచుల సైజులో 9 వెంట్రుకలు వుండేవి. సిగరెట్ తాగడం వల్ల ఆ వెంట్రుకలు మరింత పెరిగాయ‌ని తేల్చారు డాక్టర్లు.