పార్టీ సిద్ధాంతాల‌కు ఆక‌ర్షితులై బీజేపీలో చేరిన కామారెడ్డి‌ యువ‌త‌

పార్టీ సిద్ధాంతాల‌కు ఆక‌ర్షితులై బీజేపీలో చేరిన కామారెడ్డి‌ యువ‌త‌

బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కామారెడ్డి జిల్లా కు చెందిన యాభై మందికి పైగా యువ‌త ఆదివారం కాషాయ కండువా క‌ప్పుకున్నారు. జిల్లాలోని రాజంపేట మండ‌లం, త‌ల‌మ‌డ్ల గ్రామానికి చెందిన 52 మంది యువ‌కులు స్థానిక నేత కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతాపార్టీలో చేరారు. మోదీ నాయకత్వం మీద నమ్మకంతో, అధికార టీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా బీజేపీలో చేరామ‌ని వారు అన్నారు.

ఈ సంద‌ర్భంగా కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా బీజేపీ అండగా ఉంటుందని, గత 2 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు చేశామని అన్నారు. మక్కల మద్దతు ధర సాధించాలని రైతులు రోడ్డెక్కితే 40 మంది రైతులపై కేసులు పెట్టడం దురదృష్టకరమని అన్నారు. ముఖ్యమంత్రి వైఖరితో నిర్బంధ వ్యవసాయ విధానం వల్ల రైతులు నిండా మునిగారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ఏర్పడ్డ తెలంగాణా ఇప్పుడు కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాలలో కొట్టుమిట్టాడుతుందని అన్నారు.