53 కిలోల గంజాయి స్వాధీనం

53 కిలోల గంజాయి స్వాధీనం

ఇల్లెందు, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇల్లందు డీఎస్పీ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.చంద్రభాను తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించారు. కొందరు వ్యక్తులు గంజాయిని తరలిస్తున్నారని ఇల్లందు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై సూర్య సిబ్బందితో కలిసి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కొత్తగూడెం నుంచి ఇల్లెందు పట్టణంలోకి వస్తున్న ఓ కారును ఆపి తనిఖీ చేయగా గంజాయి విషయం బయటపడింది. ఈ టైంలో కారులో ఉన్న ఓ వ్యక్తి పారిపోగా, ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన లలిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్రి, ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒడిశాకు చెందిన బేడబ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద గంజాయి కొని భద్రాచలం, ఇల్లందు మీదుగా ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రూ. 13.25 లక్షల విలువైన 53 కిలోల గంజాయిని, ఒక కారు, 3 సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై సూర్య ఉన్నారు.