- అంతరాష్ట్ర సరిహద్దు బ్రహ్మణపల్లి వద్ద స్వాధీనం
నిజాంసాగర్,(ఎల్లారెడ్డి )వెలుగు : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వద్ద ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం, ధార్ జిల్లా కేసుర్ గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి ఐచర్ వాహనంలో బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి రూ. 53,42, 830 మధ్యప్రదేశ్ కు తీసుకెళుతుండగా తనిఖీల్లో పట్టుబడ్డాయని ఎస్ ఐ సుధాకర్ తెలిపారు. నిబంధనలకు మించి నగదు తీసుకెళితే ఇబ్బందులు పడతారన్నారు. ఆన్ లైన్ ద్వారా నగదు చెల్లింపులు జరపాలని కోరారు.
నస్రుల్లాబాద్‌లో నగదు సీజ్
నస్రుల్లాబాద్, వెలుగు: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని చెక్ పోస్టు వద్ద గురువారం వాహనాల తనిఖీలో దొరికిన నగదును పోలీసులు సీజ్‌చేశారు. నాందేడ్జిల్లా భూకర్ గ్రామానికి చెందిన రాథోడ్ సుభాష్అనే వ్యక్తి తన వాహనంలో తరలిస్తున్న రూ.2,88,500 ల నగదును సీజ్ చేశామని ఎస్సై లావణ్య తెలిపారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రూ.50వేలకు మించి నగదును తరలించడమే కాకుండా, దానికి సంబంధించిన ఎలాంటి రశీదులు, బిల్లులు చూపక పోవడంతో నగదును సీజ్‌చేసినట్లు ఎస్సై లావణ్య పేర్కొన్నారు.