సికింద్రాబాద్ డివిజన్​లో..15 రోజుల్లో 54 మంది పిల్లలు రెస్క్యూ

సికింద్రాబాద్ డివిజన్​లో..15 రోజుల్లో 54 మంది పిల్లలు రెస్క్యూ
  • రైల్వే సేవలను వివరించిన సీపీఆర్ఓ శ్రీధర్

సికింద్రాబాద్, వెలుగు: రద్దీ టైంలో ప్రయాణికులకు అందిస్తున్న సేవలను వివరించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో మీడియా టూర్​నిర్వహించారు. 

దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. దీపావళి, ఛత్ పూజకు వెళ్లే ప్రయాణికుల కోసం 854 స్పెషల్​ట్రైన్స్​నడుపుతున్నట్లు తెలిపారు. అదనపు టికెటింగ్​కౌంటర్లు పెట్టామన్నారు.

సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మిత చటోపాధ్యాయ మాట్లాడుతూ.. గత 15 రోజుల్లో ప్రయాణికులు  పోగొట్టుకున్న 64 మొబైల్స్, ల్యాప్​టాప్​లు, బంగారు ఆభరణాలను రికవరీ చేశామని, సికింద్రాబాద్ డివిజన్​లో 54 మంది పిల్లలను అక్రమ రవాణా నుంచి రక్షించామని, 36 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. రైల్వే స్టేషన్​లో తప్పిపోయిన 22 మంది పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించామని చెప్పారు.