
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 54 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,887కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 7,320 శాంపిల్స్‌ని పరీక్షించగా.. 54 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 16, విశాఖ జిల్లాలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి.
చిత్తూరు జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 7, విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కరోనా కేసులు వచ్చాయి. అలాగే కొత్తగా ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 41కి చేరింది. గడిచిన 24 గంటల్లో 62 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 842 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఆస్పత్రుల్లో 1004 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.
54 new positive cases&3 deaths reported in Andhra Pradesh in last 24 hours, taking the total number of positive cases to 1887. Total discharged are 842 till date. Death toll rise to 41: State #COVID19 Nodal Officer pic.twitter.com/EiIzJddIH3
— ANI (@ANI) May 8, 2020