540 కోట్ల అక్రమ డబ్బు సీజ్

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదును పెద్ద మొత్తంలో పట్టుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం  ప్రకటించింది. ఈ నెల 25 వరకు దేశవ్యా ప్తంగా జరిపిన తనిఖీల్లో రూ.539.99 కోట్ల సొత్తు సీజ్‌ చేసినట్లు తెలిపింది. ఇందులో 143.47 కోట్ల నగదుతో పాటురూ.89.64 కోట్ల విలువైన మద్యం, రూ.131.75కోట్ల విలువైన డ్రగ్స్, రూ.162.93 కోట్ల విలువైన నగలు, రూ.12.20 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నట్లు వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ లో 103.4 కోట్లు

అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, నగలు,ఇతరత్రా రూ.103.40 కోట్ల విలువైన వస్తువులను ఆంధ్రప్రదేశ్ లో పట్టు కున్నట్లు అధికారులు చెప్పారు. దేశవ్యా ప్తంగా చూస్తే.. తమిళనాడులో అత్యధికంగా రూ.107.24 కోట్ల విలువైన సొత్తును సీజ్​ చేసినట్లు సీఈసీ పేర్కొంది. యూపీలో రూ.104.3కోట్లు , పంజాబ్ లో రూ.92.8 కోట్లు , కర్నాటకలో రూ.26.53 కోట్లు , మహారాష్ట్రలో రూ.19.11 కోట్లవిలువైన వస్తువులు తనిఖీల్లో పట్టు బడినట్లు సీఈసీవెల్లడించింది.

రాష్ట్రంలో 10.66 కోట్ల నగదు

లోక్ సభ ఎన్నికల తనిఖీల్లో మంగళవారం నాటికి రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తు న్న రూ.10.66 కోట్లనగదు పట్టు బడింది. అక్రమంగా తరలిస్తు న్న 7.79 కోట్ల నగదును పోలీసు బృందాలు పట్టు కోగా,లెక్కాపత్రాల్లేని రూ.2.86 కోట్ల నగదును ఐటీ బృందాలు సీజ్ చేశాయి. పోలీసు, ఎక్సైజ్ సిబ్బందివిడివిడిగా జరిపిన తనిఖీల్లో రూ.2.19 కోట్ల విలువైన మద్యం పట్టు బడింది. దీంతో పాటు రూ.2.45కోట్ల విలువైన డ్రగ్స్, రూ.16.29 లక్షల విలువైన 543 గ్రాముల బంగారం, రూ.3.43 లక్షలవిలువైన 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని కూడా ఈసీ నిఘా బృందాలు పట్టు కున్నాయి.