వరంగల్ జిల్లాలో 55 మొబైల్ ఫోన్స్ రికవరీ 

వరంగల్ జిల్లాలో 55 మొబైల్ ఫోన్స్ రికవరీ 

ములుగు / వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్స్​పోగొట్టుకున్న బాధితులకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి సోమవారం అందజేశామని ములుగు ఎస్పీ శబరీశ్  తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా నమోదైన ఫిర్యాదులతో బాధితులు కోల్పోయిన మొబైల్స్​ను పట్టుకున్నామని, నెల రోజుల వ్యవధిలోనే 55 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు.

మొబైల్స్​ కనిపెట్టి వారికి అందజేయడంలో కృషి చేసిన పోలీస్ సీసీఎస్ ఇన్​స్పెక్టర్ రమేశ్, ఐటీ కోర్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నిబందనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలన్నారు.