
మదనాపురం వెలుగు : 5,540 పైగా కోళ్లు చనిపోయిన ఘటన వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరులో జరిగింది. గ్రామానికి చెందిన రైతు శివకేశవరెడ్డి తన వ్యవసాయ పొలంలో షెడ్డుని ఏర్పాటు చేసుకొని కోళ్లను పెంచుతున్నారు. రెండు రోజుల్లో సుమారు 5,540 చనిపోయాయి. మృతి చెందిన కోళ్లను గుంత తవ్వి పూడ్చేశారు. సమాచారం అందడంతో జిల్లా వెటర్నరీ డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, మండల అధికారి విజయ్ వెళ్లి కోళ్లను పరిశీలించి ల్యాబ్ కు పంపించామని తెలిపారు.
బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడం లేదని అన్నారు. కొక్కెర రోగం సోకినట్టు అనుమానిస్తున్నట్టు చెప్పారు. ఐదు కోళ్లను హైదరాబాద్ల్యాబ్కు, మూడు కోళ్లను మహబూబ్‌నగర్ ల్యాబ్‌కు పంపినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ఉండడంతో కోళ్ల షెడ్లను ఖాళీగా ఉంచుకోవాలని రైతులను సూచించారు.