తెలంగాణలో బీసీల లెక్క తేలింది..ఇక ఎన్నికలే..

తెలంగాణలో బీసీల లెక్క తేలింది..ఇక ఎన్నికలే..

తెలంగాణ జనాభాలో బీసీల లెక్క తేలింది. మొత్తం జనాభాలో 55.85శాతం ఉన్నారని కులగణన సర్వేలో తేలింది.  42 శాతం హిందూ మతానికి చెందిన బీసీలు, 13.85 శాతం మంది మైనారిటీ ,ఇతరులు ఉన్నారు.1450-1500పేజీలతో సర్వే నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనుంది ప్లానింగ్ కమిషన్ .

స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులేస్తున్న రాష్ట్ర సర్కారు.. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 2న మధ్యాహ్నం  కేబినెట్​ సబ్​ కమిటీ ముందుకు  కులగణన రిపోర్ట్​ రానుంది. ప్లానింగ్​ కమిషన్​అందించే ఈ నివేదికపై  సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో చర్చ జరుగుతుంది. 

 ఫిబ్రవరి 5న రాష్ట్ర కేబినెట్​లో చర్చించి ఆమోదిస్తారు.  అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై  కులగణన తోపాటు ఎస్సీ వర్గీకరణ నివేదికపైనా చర్చించనుంది. బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం, ఎస్సీ వర్గీకరణపైనా ప్రకటన చేయనున్నట్టు తెలిసింది.