అయోధ్యలో బాలక్ రామ్ విగ్రహాన్ని ప్రతిష్టించి నెల రోజులు దాటింది. అయోధ్య రాముడిని నిత్యం పూజించి హారతులు ఇస్తున్నారు. భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాంలల్లాకు హారతి ఇచ్చి 56 రకాల భోగ్ప్రసాదాలను సమర్పిస్తున్నారు. ఈ ప్రసాదాల్లో రసగుల్లా, జలేబీ, బర్ఫీ మరియు లడ్డూలు వంటి వివిధ రకాల స్వీట్లు ఉన్నాయి.అయోధ్య రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రామ్‌లల్లాకు హారతి ఇచ్చే సమయంలో భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. దేశ విదేశాల నుంచి స్వామిని దర్శించుకొనేందుకు భక్తులు వస్తున్నారు.
శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట రోజున రామ్ లల్లాకి 56 రకాల ప్రసాదాలను అందించారు. లక్నోలోని ఫేమస్ దుకాణమైన మధురిమ నుంచి ఈ 56 రకాల ప్రసాదాలను రాముడికి సమర్పించారు. రసగుల్లా, లడ్డూ, బర్ఫీ తదితర రకాల మిఠాయిలున్నాయి. గుజరాత్‌లోని కళాకారులు రామ భక్తుల కోసం ఈ లడ్డూల ప్రసాదాన్ని తయారు చేశారు. జనవరి 22న జరిగిన సంప్రోక్షణ మహోత్సవం తర్వాత ఆలయానికి 25 కేజీల బంగారం, వెండి ఆభరణాలు, దాదాపు 25 కోట్ల రూపాయల విరాళాలు అందాయని ట్రస్టు అధికారులు తెలిపారు.
श्री राम जन्मभूमि मंदिर में विराजमान भगवान श्री रामलला सरकार को आज 56 भोग प्रसाद अर्पण किया गया।
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) February 24, 2024
56 bhog prasad was offered to Bhagwan Shri Ramlalla Sarkar at Shri Ram Janmabhoomi Mandir in Ayodhya. pic.twitter.com/uQbEOMZw6v
పురాణాల ప్రకారం కృత యుగంలో భగవాన్ ఇంద్రుని ఆశీర్వాదం కోసం విందులు ఏర్పాటు చేసేవారు. ఆ సమయంలో దేవుడిని ఆరాధించి.. హారతులు ఇచ్చి 56 రకాల మధురమైన పదార్ధాలను ప్రసాదాలను నైవేద్యంగా పెట్టేవారని విష్ణుపురాణంలో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. కృత యుగంలో మునులు.. రుషులకు ఈ ప్రసాదాలను పంచిపెట్టేవారట. ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడు గోవర్దన కొండను పూజించినప్పుడు 56 రకాల ప్రసాదాలను గోవర్దన కొండకు సమర్పించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అయోధ్య లో రామ్‌లల్లా ప్రతిష్ఠ రోజున 56 రకాల ప్రసాదాలను బాలక్ రాముడికి నివేదించినట్లు ట్రస్టు అధికారులు తెలిపారు.