హైదరాబాద్ లో 56 కొత్త అంగన్​వాడీ సెంటర్లు

హైదరాబాద్ లో 56  కొత్త అంగన్​వాడీ సెంటర్లు
  • రెండు నెలల్లో అందుబాటులోకి..  మరో 150 సెంటర్లకు ప్రతిపాదనలు  

హైదరాబాద్​ సిటీ, వెలుగు : హైదరాబాద్ జిల్లాలో త్వరలో 56 కొత్త అంగన్​వాడీ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మరో రెండు నెలల్లో సిటీలోని చార్మినార్​, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ ఐసీడీఎస్ ల​పరిధిలో  ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆసిఫ్​నగర్​మండలంలో ఏడు , ఖైరతాబాద్ మండలంలో ఐదు, బహదూర్​పురా మండలంలో ఆరు, షేక్​పేట మండలంలో నాలుగు, నాంపల్లి మండలంలో నాలుగు, సికింద్రాబాద్ మండలంలో నాలుగు, సైదాబాద్ మండలంలో ఐదు , తిరుమలగిరి మండలంలో ఐదు, ముషీరాబాద్ మండలంలో  ఒకటి, బండ్లగూడ మండలంలో ఏడు, చార్మినార్​ మండలంలో రెండు, గోల్కొండ మండలంలో రెండు, అమీర్​పేట్​మండలంలో ఒకటి, అంబర్​పేట్​మండలంలో మూడు సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

 ముఖ్యంగా స్లమ్స్​లో అంగన్ వాడీ సెంటర్ల అవసరం ఎక్కువగా ఉందని గుర్తించిన అధికారులు అవసరాన్ని బట్టి మరో 150 అంగన్​ వాడీ సెంటర్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.