న్యూఢిల్లీ: రైల్వేలు అన్ని కేటగిరీల ప్రయాణికులకు టికెట్లపై ఏటా 46 శాతం.. అంటే దాదాపుగా రూ.56,993 కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్టు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుధవారం లోక్‌సభలో రైల్వేపై పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. టికెట్ ధర వాస్తవంగా రూ.100 అయితే రైల్వేలు కేవలం రూ.54 మాత్రమే చార్జ్చేస్తున్నాయి 46 శాతం తగ్గింపు ఇస్తున్నాయని తెలిపారు.
ఇలా ఏటా ఫస్ట్ క్లాస్ఏసీ నుంచి జనరల్ క్లాస్ ప్రయాణికుల వరకు అందరికీ రూ.56,993 కోట్ల సబ్సిడీ ఇస్తున్నాయన్నారు. ప్రయాణికులకు వేగవంతమైన జర్నీ కోసం నమో భారత్ ర్యాపిడ్ రైల్సర్వీస్ను తీసుకొచ్చినట్టు చెప్పారు. మొదటగా భుజ్నుంచి అహ్మదాబాద్ వరకు సర్వీసును గత సెప్టెంబర్‌లో ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 359 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేస్తున్నటు తెలిపారు.
జనరల్ కోచ్‌లు పెంచుతం
ఈ డిసెంబర్ చివరి వరకు దేశవ్యాప్తంగా రైల్వేలలో సుమారు వెయ్యి జనరల్ కోచ్‌లు పెంచుతామని వైష్ణవ్ తెలిపారు. ఏసీ కోచ్‌ల కంటే జనరల్కోచ్ల పెంపుపైనే దృష్టి సారిస్తామన్నారు. 10 వేల జనరల్ కోచ్‌లు తయారు చేయడం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కేరళ ప్రాజెక్టులకు నిధుల సమస్య లేదు కేరళలో రైల్వే ప్రాజెక్టు కోసం భూమిని సేకరించడం కోసం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ధర్నాకు దిగాలని వైష్ణవ్ సూచించారు. థరూర్ సొంత నియోజకవర్గమైన తిరువనంతపురంలోని నెమోమ్ రైల్వే టెర్మినల్ ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
తిరువనంతపురం సెంట్రల్‌కు దూరాన్ని తగ్గించేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ ఆలస్యం అవడం.. సరిపడా నిధులు ఇవ్వకపోవడంపై థరూర్ప్రశ్నించారు. దీనిపై వైష్ణవ్ స్పందిస్తూ ‘‘బాగా రద్దీగా ఉంటే పెద్ద సిటీలు, జంక్షన్ల వద్ద కొత్త టెర్మినల్స్ నిర్మించడం, రాబోయే 50 ఏండ్ల అవసరాలు తీర్చేలా రూపకల్పన చేస్తున్నం. కేరళలో ప్రాజెక్టులు ఆలస్యం అవడానికి నిధులు లేకపోవడం కారణం కాదు. అక్కడ భూసేకరణ జరగట్లేదు. కేరళ ప్రజల్లో చాలా ఇన్ ఫ్లూయెన్స్ ఉన్న శశి థరూర్ గారు భూసేకరణ కోసం ధర్నాకు కూర్చోవాలని కోరుతున్న’’ అని వైష్ణవ్ అన్నారు.