1968లో విమాన ప్రమాదం.. 56 ఏళ్ల తరువాత మృతదేహాలు వెలికితీత

1968లో విమాన ప్రమాదం.. 56 ఏళ్ల తరువాత మృతదేహాలు వెలికితీత

56 ఏళ్ల క్రితం రోహ్‌తంగ్ పాస్‌పై కూలిపోయిన భారత వైమానిక దళం (IAF) AN-12 విమానంలోని ప్రయాణికుల అవశేషాలలో నాలుగింటిని సిబ్బంది వెలికి తీశారు. తిరంగా మౌంటైన్ రెస్క్యూ సహకారంతో ఇండియన్ ఆర్మీకి చెందిన డోగ్రా స్కౌట్స్ బృందం ఈ అవశేషాలను వెలికితీసింది. ప్రమాదం అనంతరం ప్రయాణికుల మృతదేహాలు శిధిలాలు, మంచుతో కప్పబడిపోవడంతో ఇన్నేళ్లకు బయటపడ్డాయి. 

మొదట అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌కు చెందిన పర్వతారోహకులు 2003లో ఈ శిధిలాలను కనుగొన్నారు. అనంతరం 2005, 2006, 2023, 2019లో భారత సైన్యం జరిపిన సెర్చ్ మిషన్‌లలో కేవలం ఐదు మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరో నాలుగు మృతదేహాలను ఇప్పుడు వెలికి తీశారు. ఈ నాలుగింటిలో మూడు మృతదేహాలు చెక్కుచెదరకుండా ఉండటం గమనార్హం. మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అందజేయనున్నారు.

Also Read:-మణికొండలో కారు బీభత్సం

ప్రమాదం ఎలా జరిగింది..?

ఫిబ్రవరి 7, 1968న 102 మంది ప్రయాణికులతో చండీగఢ్ నుండి బయలుదేరిన IAF AN-12 విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకు కూలిపోయింది. విమానం రోహ్‌తంగ్ పాస్ పై ప్రయాణిస్తున్న సమయంలో తీవ్ర వాతావరణ పరిస్థితుల ఎదురువ్వడంతో కూలిపోయింది.