ఢిల్లీలో కొకైన్ డబ్బాలు : ఈ డ్రగ్స్ విలువ రూ.2 వేల కోట్లు..

ఢిల్లీలో కొకైన్ డబ్బాలు : ఈ డ్రగ్స్ విలువ రూ.2 వేల కోట్లు..

దేశ రాజధానిలో ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. దాదాపు  560 కిలోల  కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు  పోలీసులు తెలిపారు. వీటి విలువ రూ.2వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు . సౌత్ ఢిల్లీలో రైడ్స్ చేసిన పోలీసులు డ్రగ్స్ స్మగ్లింగ్ తో సంబంధం ఉన్న  నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ భారీ కొకైన్‌ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ సిండికేట్‌ హస్తం ఉందని చెబుతున్నారు.  

సెప్టెంబర్ 29న ఢిల్లీలోని తిలక్ నగర్ లో 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ ఘటనలో  ఇద్దరు ఆఫ్ఘన్ దేశీయులను అరెస్టు చేశారు.  అదే రోజు ఢిల్లీ కస్టమ్స్ అధికారులు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో  ఒక ప్రయాణికుడి నుంచి  రూ. 24 కోట్లకు పైగా విలువైన 1,660 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ ఇవాళ  ఢిల్లీలో  భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది.