
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్పరిధిలో గురువారం కురిసిన భారీ వర్షానికి 57 కరెంట్స్తంభాలు కూలాయని, 44 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మార్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలో 7 డీటీఆర్లు, 23 పోల్స్, హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో 11 డీటీఆర్లు, 15 పోల్స్, సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో 5 డీటీఆర్లు, సరూర్ నగర్ సర్కిల్ 14 డీటీఆర్లు, 3 పోల్స్, హబ్సిగూడ 7 డీటీఆర్లు, 7 పోల్స్ దెబ్బతిన్నాయని చెప్పారు.
రాత్రికి రాత్రే కొత్తవి ఏర్పాటు చేసి సరఫరా పునరుద్ధరించామన్నారు. సిబ్బంది పనితీరును సీఎండి ముషారఫ్ఫారూఖీ అభినందించారు.