57% కార్పొరేట్ ఉద్యోగుల్లో విటమిన్ B12 లోపం.. నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభం?

57% కార్పొరేట్ ఉద్యోగుల్లో విటమిన్ B12 లోపం.. నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభం?

విటమిన్ B12 లోపం. ఇప్పుడు ఇది 50% కార్పొరేట్ ఉద్యోగుల ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటి. ఆహార అలవాట్లు, దైనందిన జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో బి12 డెఫిషియన్సీ బారిన పడుతున్నారు. బి12 లోపంతో కలిగే అనర్ధాలు, బి12 డెఫిసియన్సీ ఎలా అధిగమించాలి ఈ ఆర్టికల్లో  తెలుసుకుందాం.

భారతదేశంలో నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభం తలెత్తుతోందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. 57% కంటే ఎక్కువ మంది కార్పొరేట్ ఉద్యోగులు విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారని సర్వేలో తేలింది. బి12 శక్తి ఉత్పత్తి, మెదడు పనితీరు, ఎర్ర రక్త కణాలను తయారు చేసే  ముఖ్యమైన పోషకం. మహిళల్లో కూడా దాదాపు 50% మందిలో బి12  లోపం మెడిబడ్డీ సంస్థ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది.

మెడిబడ్డీ నిర్వహించిన అధ్యయనంలో 4,400 మంది వ్యక్తుల (3,338 మంది పురుషులు మరియు 1,059 మంది మహిళలు) నుండి డేటాను విశ్లేషించింది. పట్టణ ప్రాంతాల్లో నివసించే ఐటీ, ఇతర కార్పొరేట్ ఉద్యోగులు తీసుకుంటున్న ఆహారం, అధిక ఒత్తిడి, క్రమరహిత ఆహారపు అలవాట్ల కారణంగా ఎలా ప్రమాదంలో ఉన్నారో హైలైట్ చేసింది. అయితే ఆహారంలో కొన్ని మార్పులు సహజంగా B12 శోషణను మెరుగుపరచడంలో న్యూట్రిషన్లు చెబుతున్నారు. సరళమైన ఆహార మార్పులతో విటమిన్ B12 స్థాయిలను ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.

బి12 అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా..

విటమిన్ B12 ప్రధానంగా జంతు ఆధారిత ఉత్పత్తులలో లభిస్తుంది. కాబట్టి మాంసాహారులు వీటిని తమ ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం. 
గుడ్లు (ముఖ్యంగా పచ్చసొన),పాలు, జున్ను వంటి పాల ఉత్పత్తులు, చికెన్ ,చేపలు, మటన్,కాలేయం,మూత్రపిండాలు వంటి అవయవ మాంసంలో బి12 పుష్కలంగా లభిస్తుంది.

మీరు శాఖాహారులైతే..

బలవర్థకమైన ఆహారం ద్వారా బి12 పొందవచ్చు. శాఖాహారం తినే వారిక సహజ బి12 పొందడం కొంచెం కష్టం. అయితే  ఈస్ట్ లాంటి పదార్థాల్లో బి12 పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు బలవర్థకమైన మొక్కల ఆధారిత సోయా, బాదం, ఓట్స్ ఆధారిత పాలు,తృణధాన్యాలు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బి12 లోపాన్ని నివారించవచ్చు. 

బి12 మెరుగైన శోషణ కోసం..

బి12 టేబుల్ లో అత్యధికంగా శోషణం చెందాలంటే ఎక్కువ ప్రోబయోటిక్స్ తీసుకోవాలి.
B12 అధికంగా ఉండే ఆహారాలు తినడం మాత్రమే సరిపోదు. మీ పేగు ఆరోగ్యం పోషకాల శోషణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల B12 శోషణకు ఆటంకం ఏర్పడుతుంది.ఆహారం తగినంతగా తీసుకున్నప్పటికీ బి12 లోపం ఏర్పడుతుంది.ప్రోబయోటిక్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే పెరుగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ప్రోబయాటిక్ పదార్థాలు..

పెరుగు,ఇడ్లీ-దోస పిండి వంటి పులియబెట్టిన ఆహారాలు,
ఊరగాయలు ఆరోగ్యకరమైన ప్రేగు శరీరం B12 ను మరింత సమర్థవంతంగా  గ్రహిస్తుంది.

ప్రాసెస్డ్,జంక్ ఫుడ్స్ తగ్గించండి..

జంక్ ఫుడ్, ఎరేటెడ్ డ్రింక్స్, అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారం అధికంగా తీసుకోవడం వల్ల గట్ లైనింగ్ దెబ్బతింటుంది. B12 శోషణపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ ఆహారంలో అధిక చక్కెర ప్రేగులో మంచి బ్యాక్టీరియాకు హాని కలిగిస్తుంది. దీంతో జీవక్రియకు ఆటంకం కలిగి పోషకాలు శోషణ జరగదు.తాజా కూరగాయలు,ఇంట్లో వండిన భోజనం తినడం ద్వారా పోషకాల శోషణ శక్తి పెంచుకోవచ్చు.

ఐరన్, పోలేట్ అధికంగా ఉన్న ఆహారంతో..

ఐరన్ పోలేట్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.విటమిన్ బీట్ వెల్ రక్త కణాలు ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో ఐరన్ పోలేట్ తో కలిసి పనిచేస్తుంది. వీటిలో దేని లోపం ఉన్నా మరో దానిపై ప్రభావం పడుతుంది.

బి12 శోషణ మెరుగవ్వాలంటే..

పాలకూర, మెంతులు వంటి ఆకుకూరలు,కాయ ధాన్యాలు,బీన్స్, బీట్‌ రూట్ ,దానిమ్మ,
అవిసె గింజలు,బాదం వంటి గింజలు తీసుకోవడం ద్వారా పోషకాలతో కూడిన సమతుల ఆహారం అందటమే కాకుండా శోషణ ప్రక్రియ మెరుగుపడుతుంది.

అవసరమైతే బి12 సప్లిమెంట్స్..

ఆహారంలో మార్పులు మాత్రమే సరిపోకపోతే, ముఖ్యంగా తీవ్రమైన లోపాలు ఉన్నవారికి సప్లిమెంట్లు అవసరం కావచ్చు. కింది వాటి కోసం డాక్టరును సంప్రదించడం మంచిది. బి12 టాబ్లెట్లు, తీవ్రమైన కేసులకు B12 ఇంజెక్షన్లు,B12 తో మల్టీవిటమిన్లు అందుబాటులో ఉన్నాయి.క్రమం తప్పకుండా చెకప్స్, బీపీ చెక్ అప్, డీటెయిల్స్ స్థాయిని పరిశీలించడం, సప్లిమెంట్లు అవసరమా అనేది నిర్ణయించడంలో సహాయపడతాయి.